BREAKING
పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం తగదు.... కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల.. గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం... " ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ

ములగ సాగుతో అదనపు ఆదాయం పొందాలి

Select Suryaa Now
ములగ సాగుతో అదనపు ఆదాయం పొందాలి


రైతులకు సాగు విధానంపై అధికారుల అవగాహన

మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్...
రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులను అనుసరిస్తూ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సూచించారు. ములగ సాగు ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు ఉన్న అవకాశాలను రైతులకు వివరించారు. మెలియాపుట్టి మండలం బాణాపురం పంచాయతీ భగడ గ్రామంలో సోమవారం ములగ విత్తనాల నాటే విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు ములగ విత్తనాలు నాటే పద్ధతిని వివరించారు. మొక్కల మధ్య, వరుసల మధ్య నిర్ణీత దూరం ఉండేలా తాడుతో కొలతలు తీసుకోవాలని సూచించారు. నాటే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, ఆశించిన దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొక్కలకు గాలి, వెలుతురు సమృద్ధిగా అందేలా సరైన అంతరాన్ని పాటించడం అవసరమని వివరించారు.
వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా సాగు ఖర్చులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు మెరుగైన ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. రైతులు ఉద్యాన పంటల సాగుపై అవగాహన పెంచుకుని, సంబంధిత శాఖల అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు.
కార్యక్రమంలో పీడీ (డీఆర్‌డీఏ) మురళి, ఉద్యానవన శాఖ అధికారి టీ. బాలరాజు, డీపీఎం శ్రీరాములు, ఏపీఎం త్రినాధమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ రైతులు పాల్గొన్నారు.