BREAKING
పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం తగదు.... కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల.. గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం... " ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ

మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో చింతు శకుంతల..

Select Suryaa Now
మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో చింతు శకుంతల..


- బీజేపీ మద్దతుతో పోటీకి సన్నాహాలు.. 
- అవినీతి రహిత పాలన, అభివృద్ధే లక్ష్యమంటున్న చింతు పాపారావు

నరసన్నపేట నవంబర్ 16 మేజర్ న్యూస్ :
నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు చింతు శకుంతల నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ పెద్దల ఆశీస్సులతో సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఆమె సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈమె బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు సతీమణి కావడం విశేషం.

ఈ సందర్భంగా చింతు పాపారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. నరసన్నపేట మేజర్ పంచాయతీలో అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న చింతు శకుంతలకు ప్రజలు తమ విలువైన ఓటుతో మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే నరసన్నపేట మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పట్టణ సుందరీకరణ, చెరువుల అభివృద్ధి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, గ్రామపంచాయతీ ఆదాయ వనరులను పెంపొందించడం ద్వారా నరసన్నపేటను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని అవినీతి రహిత పాలనకు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న బీజేపీకి మద్దతు ఇవ్వాలని చింతు పాపారావు కోరారు.