రెండు రోజుల్లో 341 నామినేషన్లు స్వీకరణ
బాడంగి, సూర్య: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో మండలంలో సర్పంచ్ పదవులకు 75, వార్డు సభ్యుల స్థానాలకు 266 నామినేషన్లు కలిపి మొత్తం 341 నామినేషన్లు స్వీకరించినట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, ఎంపీడీవో డి.వి. శ్రీలత వెల్లడించారు.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, నిబంధనల మేరకు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పినపెంకి గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆమె స్వయంగా సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.