BREAKING
పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం తగదు.... కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల.. గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం... " ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ

మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగరడం ఖాయం..

Select Suryaa Now
మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగరడం ఖాయం..


- కూటమి అభ్యర్థి దానేటి రాధారాణి నామినేషన్ దాఖలు: ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం నవంబర్ 16 మేజర్ న్యూస్ :
16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడం తథ్యమని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ స్థానానికి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నేత దానేటి రాధారాణి  ఎమ్మెల్యే గొండు శంకర్  ఆధ్వర్యంలో అత్యంత అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావడం వలన నామినేషన్ కేంద్రం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అగ్రనేతల సమన్వయంతో కూటమి అభ్యర్థిగా దానేటి రాధారాణి  బరిలోకి దింపడం జరిగిందని తెలిపారు. కూటమి పార్టీల మధ్య ఉన్న బలమైన ఐక్యత, సమన్వయమే తమ విజయ రహస్యమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  సంపూర్ణ సహకారంతో శ్రీకాకుళం నగరాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నగరంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలంటే కార్పొరేషన్ పాలకవర్గం కూడా కూటమి చేతిలోనే ఉండాలని అన్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని భరోసా ఇచ్చారు. 60 డివిజన్లలోనూ కూటమి కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి ని భారీ మెజారిటీతో గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.