సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
గుంటూరు : రాజధాని ప్రాంత ప్రజల కలల నివాసానికి సరైన చిరునామాగా నిలిచేలా ఎక్రాం డెవలపర్స్ రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'క్వాంటం సిటీ' ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గుంటూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, పూర్తిస్థాయి సి ఆర్ డి ఏ అనుమతులతో ఈ వెంచర్‌ను తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా డాక్టర్ చిట్టం లక్ష్మణరావు మాట్లాడుతూ తమ ప్రాజెక్టుకు కొనుగోలుదారుల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని, ప్రారంభానికి ముందే 70 ప్లాట్లు బుక్ కావడం సంతోషకరమని తెలిపారు. రాబోయే ఏడాదిలోగా ఇందులో నిర్మిస్తున్న 8 విలాస వంతమైన ఫామ్ హౌస్‌లు కూడా బుక్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక క్లబ్ హౌస్, పచ్చని పార్కులు, భూగర్భ డ్రైనేజీ, 24 గంటల పటిష్ట భద్రత వంటి సదుపాయాలతో ఈ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథులుగా డాక్టర్ చిట్టం లక్ష్మణరావు, డాక్టర్ జగదీష్, తులసి ధర్మచరణ్, తాతంశెట్టి అవినాష్, మంచాల నాగ కోటి రవి కిరణ్ నాయుడు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తి గలవారు ప్లాట్ల వివరాల కోసం 9700550777 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
సూర్య నాయక్