ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
పెద్ద శంకరంపేట;పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం 25 మంది దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.. వేదబ్రహ్మనుల పండితుల మంత్రచరణతో పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.. అనంతరం ఆలయ ఆవరణలోని ఉసిరి తులసి చెట్లకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వత్తుల హోమం నిర్వహించి కార్తిక దీపాలు వెలిగించారు.