BREAKING
కుర్ని సంఘం కార్తీక వనబోజనలు గంప గుర్తుకు ఓటేయండి.. ఖాజాపీరా ప్రచారం : ప్యాపిలిలో ఇంటింటా తిరుగుతూ ఓటర్ల మద్దతు కోరిన స్వతంత్ర అభ్యర్థి పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్

పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం

Select Suryaa Now
పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం

కొల్చారం;కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన రైతు పసుల సుధాకర్ (35), తండ్రి రంగయ్య, వ్యవసాయంలో నష్టాలు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.వివరాల్లోకి వెళితే.. సుధాకర్‌కు కిష్టాపూర్ గ్రామ శివారులో ఉన్న అర్ధ ఎకరం సొంత వ్యవసాయ భూమితో పాటు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశాడు. అయితే సరైన వర్షాలు కురవకపోవడంతో వరి పంట ఎండిపోయింది. దీంతో వ్యవసాయం కోసం చేసిన సుమారు రూ.3 లక్షల అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనకు గురయ్యాడు.అదే విధంగా తన ఇద్దరు ఆడపిల్లలు, కుటుంబ పోషణ ఎలా సాగించాలనే మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది నవంబర్ 28వ తేదీ రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఇంట్లోని ముందు గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై మృతుడి భార్య పసుల శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మోహినుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.