కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక:
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. మెదక్ జిల్లా ఇన్‌చార్జి గతి అశోక్ యాదవ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సత్తారం ప్రవీణ్ అధ్యక్షతన నూతన మండల కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.కొల్చారం మండల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా అరిగే రమేష్, కేతావత్ ఫుల్ సింగ్, దాడి దుర్గయ్య, తునకుల మురళీధర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుట్ట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా కృష్ణ, జాయింట్ సెక్రటరీగా సదాల నర్సింలు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగపురం రవి గౌడ్, అధికార ప్రతినిధిగా ఎన్నారం యాదగిరి, గౌరవ సలహాదారుగా కలాలి రాజా గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, నేరెళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.