BREAKING
పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్ సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ!

పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త

Select Suryaa Now
పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త

రామాయంపేట;మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పేదల సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సూచించిన విధంగా నియోజకవర్గంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించి, ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మట్టి యాదగిరి రాము సత్యం తో పాటు గుల్పర్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు