BREAKING
పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్ సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ!

ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

రామాయంపేట;రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 7, 8వ వార్డుల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం రెండో విడత నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో భరోసా కల్పిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా భరోసా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొని పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. వార్డుల వారీగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు అందుబాటులో ఉంచి, అర్హులైన వారందరికీ పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ, బ్లాక్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ. రవీందర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పోచమ్మల నవనీత గణేష్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు గుప్త, చౌదరి చరిత, బైరా స్వప్న కుమార్, దాకి శ్యామల స్వామి, దేవుని రంజిత్ పుట్టి సందీప్ శంకర్ గౌడ్ రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి జిల్లా కార్యదర్శి పోచమ్మ గణేష్ విరాట్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.