100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా
రామాయంపేట;రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామాయంపేట సీఐ సైదా సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.భారతదేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం (ఫిట్‌నెస్) పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించడం, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు.