BREAKING
పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్ సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు

గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్

Select Suryaa Now
గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు  డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు  – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో సంస్థ సీఎండీ  జితేష్ వి. పాటిల్ ఆదివారం సమ్మిట్ ప్రాంగణంలో చేపడుతున్న విద్యుత్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేసిన వివిధ బ్లాక్‌లు, ఎగ్జిబిషన్ హ్యాంగర్లు, తెలంగాణ పెవిలియన్, ఇనాగరల్ హ్యాంగర్, ముఖ్యమంత్రి, మంత్రుల లాంజ్‌లు, డైనింగ్ ప్రాంతాలు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ ప్రదేశాలు, కీరవాణి కాన్సర్ట్ ఏరియాలను సీఎండీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలు, సరఫరా వ్యవస్థలు, జనరేటర్లు, కేబుల్ కనెక్షన్లు, ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐజీ  కార్తికేయ, ఐపీఎస్‌తో భద్రతా ఏర్పాట్లు, పోలీస్ శాఖతో సమన్వయం, విధుల్లో ఉన్న సిబ్బంది నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. సమ్మిట్ ప్రాంగణంలోని ప్రతి ప్రాంతంలో విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

డిసెంబర్ 3 నుంచి 13 వరకు ప్రత్యేక డ్యూటీ చార్ట్

సమ్మిట్‌కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా పర్యవేక్షణ, భద్రత, నిర్వహణ, వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బందికి డిసెంబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక డ్యూటీ చార్ట్ రూపొందించి విధులు కేటాయించింది. సమ్మిట్ ప్రాంగణంలోని రిసెప్షన్ అండ్ రిజిస్ట్రేషన్, అడ్మిన్ బ్లాక్, ఎగ్జిబిషన్ హ్యాంగర్లు, తెలంగాణ పెవిలియన్, ముఖ్యమంత్రి లాంజ్, వీవీఐపీ డైనింగ్, జనరల్ డైనింగ్ హాళ్లు, హాస్టళ్లు, ఫుడ్ కోర్టులు, తెలంగాణ స్క్వేర్, కీరవాణి కాన్సర్ట్ ఏరియా, పార్కింగ్ ప్రాంతం, కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక ఓవరాల్ ఇన్‌ఛార్జిలు, కంట్రోలింగ్ అధికారులు, సహాయక అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించారు. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఆర్‌ఎంయూలు, హెచ్‌టీ సర్వీసులు, వీధి దీపాల నిర్వహణ, ఇతర కీలక విద్యుత్ వ్యవస్థల పర్యవేక్షణకు కూడా ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ 29-11-2026న మెమో నంబర్ 612-D3/2026 ద్వారా అధికారిక విధుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశారు.

నిరంతర విద్యుత్ సరఫరాకు పటిష్ట కార్యాచరణ

సమ్మిట్ జరిగే డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీఎండీ ఆదేశించారు. ప్రతి ప్రాంతంలో విద్యుత్ లోడ్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, కేబుల్స్, ప్యానెల్స్, ఎర్తింగ్, జనరేటర్లు, బ్యాకప్ విద్యుత్ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. జనరేటర్ల పనితీరు, ఇంధన నిల్వలు, కేబుల్ జాయింట్లు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా మార్గాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ సరఫరా మార్గాలు, జనరేటర్ల స్థానాలు, బ్యాకప్ ఏర్పాట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇతర ప్రభుత్వ శాఖలు, పోలీస్ అధికారులు, సమ్మిట్ నిర్వాహకులు, సంబంధిత ఏజెన్సీలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని ఆదేశించారు. విధులకు నియమితులైన అధికారులు తమ సాధారణ విధుల నుంచి రిలీవ్ అయ్యేలా సంబంధిత సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో సాధారణ విద్యుత్ నిర్వహణ, వినియోగదారుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు విచ్చేసే అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సందర్శకులకు తెలంగాణ విద్యుత్ శాఖ సాంకేతిక సామర్థ్యం, పటిష్టమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సేవలను చాటిచెప్పేలా ప్రతి అధికారి, ఉద్యోగి సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సీఎండీ సూచించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు సీహెచ్. చక్రపాణి, డాక్టర్ ఎన్. నరసింహులు, వి. శివాజీ, సంబంధిత చీఫ్ ఇంజినీర్లు, రాజేంద్రనగర్ జోన్ అధికారులు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.