*భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే*
నిజాంపేట్;నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట మండల పరిధిలోని మొదలగుంట తండాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ భవానీ మాత మరియు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమంలో ఆదివారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం తండా పెద్దలు, గిరిజన సోదరులు, భక్తులతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గిరిజన సమాజం ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో గొప్ప సంప్రదాయాలను కలిగి ఉందని, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సంగమేష్, రాధా కృష్ణా సెట్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండరి రెడ్డి నాయకులు జింకల వెంకటేష్, సంగారెడ్డి, బాబు రావు సర్పంచ్, తండా పెద్దలు, గ్రామ ప్రజలు, గిరిజన నాయకులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.