దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: దేశవ్యాప్తంగా జరగనున్న జన గణనలో ఓబీసీ కులగలన చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిలు ఓబీసీ కాలం చేర్చాలని, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని బీసీ మరియు రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక యువజన క్రీడల శాఖ మంత్రి వాకాటి శ్రీహరిలు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో డిసెంబర్ 14న ఢిల్లీలో జరిగే బీసీల జన బేరి సభకు హాజరుకావాలని కోరుతూ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, లోక్ సభ సభ్యులు సురేష్ లకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆద్వర్యంలో ను బిసి ప్రతినిదుల బృందం వారిని స్యయంగా కలిసి ఆహ్వానాలు అందజేశారు, ఈ సందర్భంగా చలో ఢిల్లీని విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ను బీసీ సంఘాల నేతలతో కలిసి ఇరువురు మంత్రులు, బిసి ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.
తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో జరిగిన మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా జనగణన నిర్వహించాలని ప్రతి కులానికి ఒక యూనిట్ కోడ్ కేటాయించి డ్రాప్ డౌన్ పద్ధతిలో ఓబీసీ కులగలన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కనీసం పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం మొండి వైఖరితో ముందు వెళ్లడం చాలా బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓబిసి గణంకాలు చేపట్టక పోవడం మూలంగా గత 80 ఏళ్లుగా 60% ఉన్న బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతూనే ఉందని, రాష్ట్రాలు కులగలను చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన న్యాయస్థానాలు అంగీకరించడం లేదని, కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేస్తేనే బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయని వారు తెలిపారు డిసెంబర్ 14న బీసీ సంఘాలు చేపట్టనున్న చలో ఢిల్లీ బీసీల జన వీధి సభకు బీసీ బిడ్డలుగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా, బీసీ జేఏసీ కో చైర్మన్ శేఖర్ సగర,బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్,ఈడిగ శ్రీనివాస్ గౌడ్, రావులకోల్ నరెష్,తారకేశ్వరి,సంద్యరాణి,
దేవిక, గూడూరు భాస్కర్, వరుణ్ గౌడ్, బండి గారి రాజు, మల్లేష్ యాదవ్,గుంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.