BREAKING
ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్ సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి

కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం

Select Suryaa Now
కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం

సంగారెడ్డి;తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ నిరాహార దీక్ష ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైన పరిస్థితులను సృష్టించిందని చింతా ప్రభాకర్ అన్నారు. దీక్షా దివస్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, ఉద్యమకారుల పోరాటాలను స్మరించుకునే సందర్భమని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు రాష్ట్ర ఆత్మగౌరవం, హక్కులు, ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. 2023 ఎన్నికల సమయంలో తన ఆరోగ్యం సహకరించకపోయినా కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ కోసం కష్టపడ్డారని గుర్తుచేసుకున్నారు. వారు తనపై చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు. వ్యక్తిగత పదవుల కంటే పార్టీ గెలుపే ముఖ్యమని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని, కేసీఆర్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై పార్టీ శ్రేణులు నిరంతరం పోరాడాలని సూచించారు.మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ రాజకీయంగా తరచూ వైఖరి మార్చుకునే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలు, ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.మాజీ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు, మెడికల్ కళాశాలల ఏర్పాటు, ఉద్యోగుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హకీమ్ భాయ్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విఠల్, మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మల్లాగౌడ్, కసిని శ్రీకాంత్, అంజాద్, శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.