కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
మక్కువ, నవంబర్ 29, (మేజర్ న్యూస్): పంచాయితీ ఎన్నికల సమరంలో భాగంగా పంచాయితీ వరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం హారహోరేగా సాగిస్తున్నారు. ఆదివారం కాశీపట్నం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జనసేన నాయకుడు మర్రాపు సురేష్ తల్లి మర్రాపు వరలక్ష్మి తరుపున ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు పంచాయతీ పరిధిలోగల మేలాపువలస, ములక్కాయ వలస, కాశీపట్నం, కొండ రేజారు గ్రామాల్లో తమ మద్దతు దారులను భారీగా మోహరించి ప్రచారాన్ని హోరెత్తించారు. అలాగే మరో అభ్యర్థి కోట్ల నారాయణరావు సతీమణి అయిన కోట్ల నారాయణమ్మ కూడా తమ ప్రచారాన్ని హోరేస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పంచాయితీ బరిలో పోటీకి దిగినందున గెలుపు దీమాతో ప్రచారాన్ని సాగిస్తున్నారు.