BREAKING
ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Select Suryaa Now
శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

శ్రీకాకుళం-మేజర్ న్యూస్ ప్రతినిధి: శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక సంఘం సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల వేదికగా ఉదయం నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. లెక్కింపు విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది అంతా సోమవారం ఉదయం 5:00 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని రిపోర్ట్ చేయాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి జి. శ్రావణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని 60 వార్డుల కార్పొరేటర్లు, మేయర్ ఓట్ల లెక్కింపు కోసం శివాని కళాశాల ఫార్మసీ బ్లాక్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు 7 కౌంటింగ్ హాళ్లలో 60 టేబుళ్లను ఏర్పాటు చేసి, ప్రతి 4 వార్డులకు ఒకరు చొప్పున 15 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), 15 మంది ఏఆర్వోలను నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 7వ హాల్‌లో అదనంగా 2 టేబుళ్లు, ఒక ఆర్వో, ఏఆర్వోను కేటాయించారు. అలాగే మేయర్ ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లలో 30 టేబుళ్లతో పాటు అదనంగా మరో 2 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 97 కౌంటింగ్ బృందాలకు ఐడీ కార్డులు, ఫుడ్ కూపన్ల జారీ కోసం 11 కౌంటర్లు, హెల్ప్ డెస్క్, మీడియా పాయింట్, సాంకేతిక బృందాలతో పాటు స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా తరలించేందుకు పర్యవేక్షణ సిబ్బందిని నియమించారు. మరోవైపు ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలోని వార్డు కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ ఎన్నికల ఓట్ల లెక్కింపును కూడా శివాని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం 3 కౌంటింగ్ హాళ్లను కేటాయించగా, వార్డు కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు, చైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపునకు 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం 40 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 40 మంది కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్‌వైజర్లు, 80 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 27 మంది రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 187 మందిని నియమించారు. ఈ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో శనివారం ఆమదాలవలస పురపాలక కార్యాలయ ఆవరణలో శిక్షణ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు.