*డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*
రాయికోడ్; కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఈనెల 30 నుంచి నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో. ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య తెలిపారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించకూడదని వారు పేర్కొన్నారు.ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపులను మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పునర్విభజనతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.దక్షిణాది రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని అయన తెలిపారు