ప్యాపిలిలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికల ప్రచారం సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా బుగ్గన అర్జున్ అమర్‌నాథ్ రెడ్డి ఇంటింటి పర్యటన
ప్యాపిలి, మేజర్ న్యూస్: ప్యాపిలి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వైకాపా యువనేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ అమర్‌నాథ్ రెడ్డి పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హనుమరాజు రంగనాయకులు గెలుపును కాంక్షిస్తూ ఆయన ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా అభ్యర్థికి కేటాయించిన 'వంకాయ' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అర్జున్ అమర్‌నాథ్ రెడ్డి ప్రచారంలో పాల్గొనడంతో స్థానిక పార్టీ శ్రేణులు, యువతలో నూతనోత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బోరా మల్లికార్జునరెడ్డి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి, చిన్న సుంకయ్య, జింకల లంజి, కొండయ్య, మస్తాన్ ఖాన్, దాసరి శ్రీను, పర్వతం శ్రీను తదితరులు పాల్గొన్నారు.