BREAKING
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్ సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం

ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు,  73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు

 

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో తెలంగాణలో ఏకంగా 73.18 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారన్న అంశంపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మూడు కోట్ల మంది ఓటర్లున్న రాష్ట్రంలో దాదాపు నాలుగో వంతు మంది చనిపోయారనో, రాష్ట్రం విడిచి వెళ్లిపోయారనో, అదృశ్యమయ్యారనో చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘ది హిందూ హడిల్‌’ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైనదని, ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికావడం అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామమని పేర్కొన్నారు.
“నేను వరుసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించాను. సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉంటూ రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నాను. అలాంటి నాకు కూడా 73.18 లక్షల మంది ఓటర్లు చనిపోయారనో, ఎక్కడికో వెళ్లిపోయారనో నమ్మడం సాధ్యం కావడం లేదు. ఇది సాధారణ గణాంకం కాదు.. ప్రజాస్వామ్యాన్ని అప్రమత్తం చేస్తున్న ప్రమాద ఘంటిక” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రక్రియకు నిష్పాక్షికత, పారదర్శకత, ప్రజల విశ్వాసమే ప్రాణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 
అయితే జ్ఞానేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న పరిస్థితి ఏర్పడటం ఒక పౌరుడిగా తనను తీవ్రంగా కలవరపెడుతోందని చెప్పారు.
దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగనున్నదని గుర్తుచేశారు. ఈ ప్రక్రియపై సమర్థమైన న్యాయపరమైన పరిహారానికి అవకాశం లేకపోవడం మరింత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనూ ఉపేక్షించరాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. 
ఎన్నికల సంఘం తన ప్రతి చర్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని, భారీ స్థాయిలో జరిగిన ఓట్ల తొలగింపుపై పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.