ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం
రామాయంపేట;గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రామాయంపేట నియోజకవర్గ కేంద్రం హోదాను కోల్పోయిందని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా అన్నారు. రామాయంపేటకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు, తిరిగి నియోజకవర్గ హోదా సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామాయంపేట నియోజకవర్గ పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా నాగరాజు గుప్తా మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేటను పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ హోదా నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రం హోదా కోల్పోయినప్పటి నుంచి పట్టణ అభివృద్ధి క్రమంగా కుంటుపడిందని, పట్టణంలోని వ్యాపార రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న సమయంలో రామాయంపేటకు ఉన్న ప్రాధాన్యత, ప్రస్తుతం తగ్గిపోయిందని అన్నారు.రామాయంపేట పట్టణానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలంటే నియోజకవర్గ హోదాను సాధించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో రామాయంపేట నియోజకవర్గ పునరుద్ధరణ సాధ్యమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవి నాయక్ కాంగ్రెస్ పార్టీమాజీ పట్టణ అధ్యక్షుడు దాకి స్వామి విరాట్ తో పాటు నాయకుడు పాల్గొన్నారు