BREAKING
ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం

Select Suryaa Now
మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం

గరుగుబిల్లి, మేజర్ న్యూస్: గరుగుబిల్లి మండలం మరు పెంట గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడమల సత్యనారాయణలకు ఆత్మీ య సత్కారం లభించింది.ఈ మేరకు ఆదివారం సుంకి పంచాయతీ పరిధిలో ని కె.ఆర్.ఎన్.వలస గ్రామానికి చెందిన నడిమింటి సురేష్, నడిమింటి జగన్నా థంతోపాటు గ్రామానికి చెందిన పలువు రు నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మ,టిడిపి నాయకులు ఉడ మల సత్యనారాయణలను మర్యాద పూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.
ఈసందర్భంగా కె ఆర్ ఎన్ వలసకు చెందిన నడిమింటి సురేష్,నడిమింటి జగన్నాథంలు మాట్లాడుతూ మరుపెంట పంచాయతీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు, గ్రామ అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మ, టిడిపి నాయ కులు ఉడమల సత్యనారాయణలను కోరారు.అనంతరం సన్మాన గ్రహీతలు ఉడమల పార్వతమ్మ, సత్యనారాయ ణలు మాట్లాడుతూ తమపై ఎంతో అభిమానంతో సత్కరించిన కె.ఆర్. ఎన్. వలస గ్రామస్థులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరుపెంట గ్రామ పంచాయతీని అభివృద్ధి పదములో నడిపించేందుకు తమ శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈసందర్భంగా నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మ పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో కె.ఆర్.ఎన్. వలసకు చెందిన నడిమింటి సురేష్,నడిమింటి జగన్నాథం, గ్రామ పెద్దలు, మరియు పలువురు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.