వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య
న్యాల్కల;ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే భార్య బలితీసుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు గోపాల్‌తో కలిసి హత్యకు పథకం రచించింది. దీంతో గోపాల్ రమేష్‌ను 21 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, ఆనవాళ్లు లేకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మెటల్‌కుంటలో వెలుగుచూసిన ఈ దారుణ హత్య కేసును హద్నూర్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం ఘనపూర్‌కు చెందిన మన్నె రమేష్ (45) ఈ హత్యకు గురయ్యాడు. ఈ నెల 26న గోపాల్.. రమేష్‌ను కంకోల్ నుంచి మెటల్‌కుంట రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చాడు. అక్కడ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో రమేష్‌పై కత్తితో 21 సార్లు దాడి చేసి హత్య చేశాడు. అనంతరం హత్య ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గోపాల్, భాగ్యమ్మలను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. భర్తను అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో భాగ్యమ్మ ప్రియుడు గోపాల్‌తో కలిసి హత్యకు పథకం వేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ సైదా నాయక్ కేసు వివరాలను వెల్లడించారు. హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ నరసింహులు, ఎస్సై సుజిత్‌తో పాటు పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.