BREAKING
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.

చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు

Select Suryaa Now
చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం  గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం  ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్  గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు

చిట్టమూరు మేజర్ న్యూస్

చిట్టమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూటమి అభ్యర్థి గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం సర్పంచ్ పదవికి ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె ఏకగ్రీవ ఎన్నికను ధ్రువీకరిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.గ్రామ పంచాయతీ పరిధిలోని 10 వార్డుల సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్,సుశీలమ్మ కుమారుడు గణపర్తి కిషోర్ నాయుడు మాట్లాడుతూ..తన తల్లి గణపర్తి సుశీలమ్మను సర్పంచ్‌గా,10 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన చిట్టమూరు గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు,కూటమి నాయకులు,కార్యకర్తలకు, అన్ని పార్టీల నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.పంచాయతీలో పార్టీలకతీతంగా,ఎలాంటి విభేదాలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని కిషోర్ నాయుడు తెలిపారు.స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం,గ్రామ ప్రజల సహకారంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. చిట్టమూరు పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.తన తల్లిని సర్పంచ్‌గా,10 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని,వారి సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నారు.

అనంతరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సర్పంచ్ గణపర్తి సుశీలమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్