|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:38 PM
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలని మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జీవో 64 నిలిపివేసి,పాతబద్ధతిలోనే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సిఐటియు అనంతరం గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజమర్రి మల్లేశం మాట్లాడుతూ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసే ఉద్యోగుల సమ్మెకు సిఐటియు మెదక్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.