|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 07:53 PM
మద్యం మీద వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోందని BRS నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 'ఎక్సైజ్ పాలసీ గడువు నవంబర్ దాకా ఉండగా ఇప్పుడే కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దరఖాస్తు ధరను రూ.2-3 లక్షలకు పెంచుతున్నారు. అడుగడుగునా మద్యం షాపులు తెరవాలని ప్రణాళిక వేస్తున్నారు. మద్యం మాఫియాను పెంచిపోషించి కల్లు దుకాణాలను మూసి వేసే కుట్ర చేస్తున్నారు' అని ఫైర్ అయ్యారు.