|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 12:48 PM
ఎల్లారెడ్డి సెగ్మెంట్, సదాశివనగర్ మండలం, యాచారం తండాలోని సేవాలాల్ జగదాంబ అమ్మవారి గుడిలో గత మూడు రోజుల క్రితం చోరీకి గురైన నగలు మరియు విగ్రహం బుధవారం తెల్లవారుజామున యథాస్థానంలో కనిపించడంతో గ్రామస్తులు, పూజారులు ఆశ్చర్యపోయారు. గుడిలో అమ్మవారి వెండి విగ్రహం సహా చోరీకి గురైన నగలు తిరిగి అమర్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ సంఘటనను గురించి గ్రామస్తులు మాట్లాడుతూ, దొంగ తాను దొంగిలించిన విగ్రహం, నగలను **అమ్మవారి గుడిలో తిరిగి ఉంచి వెళ్లడం అంటే, దొంగలో మార్పు వచ్చినట్లేనని, ఇది అమ్మవారి మహిమ అని విశ్వసిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.