|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 06:07 PM
బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2' ఒకటి. మతపరమైన అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు భారీ కట్స్ సూచించడంతో పాటు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 27 కట్స్ తర్వాత విడుదలైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది. వాణిజ్యపరంగా భారీ వసూళ్లు సాధించకపోయినా, డీసెంట్ నంబర్స్‌తో సినిమా నిలబడింది.
Latest News