|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 08:12 PM
హీరో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు. మంగళవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని, అవి పూర్తైన తర్వాతే పెళ్లి చేసుకుంటారని తెలిపారు. అమ్మవారిని కూడా ఇదే విషయమై మొక్కుకున్నట్లు ఆమె చెప్పారు. ఇక సోమవారం విడుదలైన 'రాజాసాబ్' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని, సినిమా అలరిస్తుందని శ్యామలాదేవి ధీమా వ్యక్తం చేశారు.
Latest News