|
|
by Suryaa Desk | Sun, Sep 28, 2025, 09:54 PM
మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చలో ఉంటూనే ఉంటుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన వ్యక్తిగత జీవితం మరియు కుటుంబం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది."ప్రస్తుతం నేను వేరుగా ఉంటున్నాను. అయితే, దాంతోనే ఫ్యామిలీకి దూరమైపోయానని కాదు. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి వాళ్లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాను. ఎందుకంటే వాళ్లే నా జీవితం," అంటూ నిహారిక తెలిపింది."ఇటీవల మా అన్న వరుణ్‌కి బాబు పుట్టాడు. అప్పటి నుంచి నేను బిజీగా మారిపోయాను. మా అల్లుడిని ఎత్తుకుని తిరుగుతూనే ఉంటున్నా. అందుకే ఎవ్వరూ నన్ను ఎలాంటి పనులు చేయమని అడగట్లేదు. లేదంటే, చిన్న విషయానికి కూడా 'నీళ్లు తేచి పెట్టు', 'అది తీసుకో' అంటూ ఎవరన్నా ఏదో ఒకటి చెప్పేవాళ్లు. ఇప్పుడు మాత్రం అంతా నాకు బ్రేక్ ఇచ్చేసినట్టు ఉంది," అని నిహారిక నవ్వుతూ చెప్పింది."ఒకవేళ మా అల్లుడు ఎదిగాక యాక్టర్ అవుతానంటే, ఖచ్చితంగా నా బ్యానర్ లోనే సినిమా తీస్తాను," అంటూ ఆమె హామీ ఇచ్చింది.ఇంకా మాట్లాడుతూ, "ఇటీవల కల్యాణ్ బాబాయ్ నటించిన ఓజీ రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ ఓజీ ఫీవర్ పట్టేసింది. నిజంగా ఆ సినిమా మేం ఊహించిన దానికంటే బిగ్ హిట్ అయ్యింది," అంటూ నిహారిక గర్వంగా పేర్కొంది.
Latest News