విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత
సూర్య, దండేపల్లి : మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు వోల్లాల లచ్చన్న (బాపు) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు. సంఘం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఆయన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి, సంఘం అభివృద్ధికి విశేష సేవలందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందారు. ఆయన మృతి పట్ల విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి మండలానికి తీరని లోటని పేర్కొన్నారు.