లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి
లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి
మునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన చెన్నగోని కాటంరాజు గత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెంది, తీవ్ర మనోవేదనకు గురై, గుండెపోటుతో మృతి చెందారు.స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి చెన్నగోని కాటంరాజు కుటుంబాన్ని పరామర్శించి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సురిగి నరసింహ గౌడ్ తో శనివారం పంపించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సురిగి నరసింహ ప్రగాడ సానుభూతి తెలిపి రూ. 1,00,000/- అందజేశారు.లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి కి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
కె. ఇంద్రసేనా రెడ్డి, మేజర్ న్యూస్, మునుగోడు,నల్గొండ జిల్లా