మల్లన్నసాగర్ కట్టకి ఇలాంటి ప్రమాదం లేదు
మల్లన్నసాగర్ కట్టకి ఇలాంటి ప్రమాదం లేదు
బ్లాస్టింగులు జరగలేదు
రసాయన పదార్థాలతో మిషన్ల ద్వారా బండరాలను తొలగించామని అధికారులు వెల్లడి
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్......మల్లన్నసాగర్ నుండి హైదరాబాద్ ఇతర జిల్లాలకు తాగునీటి అవసరాలకు గురించి ప్రతి సంవత్సరం 20టీఎంసీల నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈపంప్ హౌస్ను పనులను చేపట్టిందని హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేష్ పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో నిర్మిస్తున్న పంప్ హౌస్ వద్ద శనివారం హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేష్, సిఈ శివధర్మ తేజ, ఎస్ఈ లక్ష్మణ్,ఈఈ,కవిత విలేకరులతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని, ఎలాంటి బ్లాస్టింగులు జరగలేదని రసాయన పదార్థాలతోనే బండరాలను తొలగించామని అధికారులు వెల్లడించారు. మల్లన్న సాగర్ కట్ట నుండి 290 మీటర్ల దూరంలో ఉందని కొలతల ద్వారా నిర్ధారించామని,సిపేజి వాటర్ వల్ల కట్టకు ఎలాంటి ప్రమాదం లేదు అధికారులు తెలిపారు. రసాయనాలతోనే కాంక్రీట్ మాత్రమే వేసాము నాలుగు నెలల క్రితం తవ్వకాల సమయంలో పెద్ద బండ రాళ్లు ఎదురు కావడంతో దానికి రంధ్రాలు వేసి రసాయన పదార్థాలు నింపి మరుసటి రోజున మిషన్ల సహాయంతో రాయని తొలగించాం పంప్ హౌస్ వద్ద పెద్ద పెద్ద రాళ్ల కారణంగా ఆ ప్రాంతంలో పనులను నిలిపివేసి వేరే వైపు నుండి పనులు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.