మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత
*కడ్తాల్, రంగారెడ్డి
ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున రెండు కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ మండలంలో మరణించిన నిరుపేద కుటుంబాలకు తక్షణమే స్పందించారు.
న్యామంతపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓర్సు సరస్వతి తుక్కుగూడ సమీపంలో జరిగిన ప్రమాదంలో, రావిచేడు గ్రామానికి చెందిన అండే కార్ రామోజీ అనారోగ్యంతో మరణించారు. బాధిత కుటుంబాల వద్దకు చేరుకుని పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొప్పిడి గోపాల్, ప్రియ రమేష్, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రంగయ్య, వసంత, గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్, రామచంద్రయ్య, రవి, మోబిన్, చందు, లింగం, అశోక్, వెంకటేష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.