BREAKING
తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య ఖతార్ మధ్యవర్తులతో ఇరాన్ రాయబారుల రహస్య భేటీ కొనుగోలు కేంద్రం ప్రారంభించండి మహాప్రభో నాగు పాము దర్శనం... భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

మెదక్ జిల్లాలో మనోహరాబాద్ ఒక్కటే కరువు పీడిత మండలం

Select Suryaa Now
మెదక్ జిల్లాలో మనోహరాబాద్ ఒక్కటే కరువు పీడిత మండలం

మెదక్, : మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలం మాత్రమే కరువు పీడిత మండలంగా నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్ స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్‌కు సంబంధించి జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నమోదైన వర్షాభావ పరిస్థితులపై రూపొందించిన మండలాల వారీ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.కరువు పరిస్థితులను నిర్ధారించేందుకు రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కరువు పర్యవేక్షణ సెల్‌లు ఎప్పటికప్పుడు వర్షపాతం, పొడి కాలం తదితర సూచికలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తాయని తెలిపారు. కరువు నిర్ధారణలో వర్షపాత వ్యత్యాసం, నిర్దిష్ట వ్యవధిలో వర్షాలు లేకపోవడం (పొడి కాలం) కీలక సూచికలుగా పరిగణిస్తారని వివరించారు.సాధారణంగా నాలుగు వారాల పాటు కొనసాగిన పొడి కాలాన్ని కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారని, తేలికపాటి నేలల విషయంలో ఈ వ్యవధి మూడు వారాలుగా ఉంటుందని పేర్కొన్నారు.

21 మండలాల నివేదికలో కీలక వివరాలు

ఖరీఫ్ 2026 సీజన్‌కు సంబంధించి జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జిల్లాలోని మొత్తం 21 మండలాల పొడి కాలం నివేదికను పరిశీలించగా.. మనోహరాబాద్ మండలంలో ఒక పొడి కాలం నమోదైనట్లు తెలిపారు. మిగిలిన 20 మండలాల్లో ఎలాంటి పొడి కాలాలు నమోదు కాలేదని వెల్లడించారు.ఈ నివేదికలోని మొత్తం కరువు కాలాల వివరాల ఆధారంగా మనోహరాబాద్ మండలాన్ని కరువు పీడిత మండలంగా సంబంధిత అధికార యంత్రాంగం ప్రకటించినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలోని మిగతా మండలాల్లో నివేదిత కాలానికి సంబంధించి పొడి కాలం నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.