BREAKING
ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ఆరేళ్లే పిల్లల భవిష్యత్తుకు పునాది మెదడు అభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంబర్ పేట్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరణ కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి

ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు

Select Suryaa Now
ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు

పటాన్‌చెరు;తన పరిపాలనా దక్షతతో భారతదేశ ఉక్కు మహిళగా పేరుగాంచిన మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని చిట్కూల్‌లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదలకు సంక్షేమ ఫలాలను చేరువ చేయడంతో పాటు దేశ అభివృద్ధికి ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు. ఆమె ముందుచూపుతో చేపట్టిన పలు కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పాలన కొనసాగిస్తోందని నీలం మధు ముదిరాజ్ వివరించారు.