.శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ
కవి ఎర్రన సాహిత్యం లో ప్రాచీన భారతీయ కవిత్వ వైభవంతెలియగలదని డా.భైరవభట్లవిజయాదిత్య అన్నారు.శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ ఎర్రన -ఒక అజ్నాతకవి కార్యక్రమం జరిగింది.ప్రధానవక్తగా పాల్గొని ఎర్రన -న్రుసింహపురాణం అంశంపై విజయాదిత్యమాట్లాడుతూఎర్రన సాహిత్యం లో ఇంకా ఎన్నో లోతులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.ఆయన పద్యాలలో వైజ్ఞానిక విశేషాలు, ధార్మిక జీవన విధానం తెలియగలవనిఅన్నారుసత్వరజోస్తమో గుణాల లయాత్మిక తరంగం పెత్తనమే స్రుష్టి కి మానవుని అంతరంగం స్థితికి మూలమని, హిరణ్య కశిపుని పాత్ర త్రిగుణాలకు ఏవిధంగా ఊగిసలాడినదితెలిపారు.కవులపై ఎర్రన ప్రభావం ఉందని అన్నారు.వక్త విజయాదిత్యను శాలువాతో సన్మానించి జ్నాపికనుఅందజేసారు. సభాధ్యక్షులు డాక్టర్.డివి . శ్రీకాంత్ ,సమ్మానకర్త . ప్రముఖ న్యాయవాది కొట్ర క్రుష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్.గోపాలరావు, భోగరాజు బాబూజి, భోగరాజు సూర్య లక్ష్మి,డా.జక్కురామక్రుష్ణ,హరిచందనచ పాల్గొన్నారు.