BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు

Select Suryaa Now
అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,కోళ్లబైలు -1,2 తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి రాటకొండ శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు శనివారం ఆయన నివాసంలో అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు తెలుగుదేశం నాయకులు కొరముట్ల నాగరాజు,డి.రమేష్ రెడ్డి,ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు.ఇందులో భాగంగా ఆయనకు పూలమాలలు వేసి,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శ్రీనివాసులు నాయుడు విశేషకృషి చేస్తున్నారన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో కోళ్లబైలు పంచాయతీని గణనీయమైన అభివృద్ధి చేశారన్నారు.కోట్లాది రూపాయలతో సిసి రోడ్లు,మురుగునీటి కాలువలను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.ఎమ్మెల్యే ఆదేశాలతో హంద్రీ-నీవా జలాల ద్వారా అమ్మచెరువును పూర్తిస్థాయిలో నింపి భూగర్భ జలాలు పెరగడానికి కారుకులయ్యారన్నారు.తెలుగుదేశం పార్టీ అభివృద్ధి,కార్యకర్తల శ్రేయస్సుకు అహర్నిశలు కృషిచేస్తున్న శ్రీనివాసులు నాయుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.అనంతరం శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో కోళ్లబైలు పంచాయతీ అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు.ఆయన సహకారంతో మున్ముందు మరింత అభివృద్ధి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి