బస్సు సౌకర్యం ప్రారంభం
చిట్యాల, మేజర్ న్యూస్: మండలంలోని గిద్దెముత్తారం నుంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు నూతన ఆర్టీసీ బస్ సర్వీసును సర్పంచ్ బుర్ర చంద్రకళ రవీందర్ ప్రారంభించారు. ప్రజల సౌకర్యం కోసం జమ్మికుంటకు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కు తెలుపగా ఆయన స్పందించి హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు కల్పించిన బస్సు సౌకర్యాన్ని గ్రామ సర్పంచ్ చంద్రకళ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాఘవపూర్ సర్పంచ్ అంబాల కిరణ్, ఉప సర్పంచ్ లు, నాయకులు దొంతుల శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్; సదానందం ,చిట్యాల ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా