దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి
టేకుమట్ల , మేజర్ న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ ఐ అమూల్య సూచించారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీసెస్) నుంచి ముందస్తు అనుమతులు పొందాలని తెలిపారు.ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జి అమూల్య హెచ్చరించారు.
రిపోర్టర్; రాజ కొమురయ్య, టేకుమట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా