BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం!

Select Suryaa Now
కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం!

*--కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోని ప్రభుత్వం.* 

 *--ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు* 

*--పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలి* 

*--నవాబుపేట,మిడ్జిల్ మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.* 

*--రైతులను ఆదుకోకుంటే తిరుగుబాటు తప్పదు.* 

*--ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి.* 

నవాబుపేట సూర్య న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపంగా మారిందని,కరువుతో అల్లాడుతున్న రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు నేడు పెట్టుబడి కూడా చేతికి రాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,ఇప్పటికైనా స్పందించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ఆదివారం మండలంలోని అమ్మాపూర్,ధర్పల్లి గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని రైతులను కలిసి పంటల పరిస్థితి,సాగు కోసం చేసిన అప్పులు,ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.అమ్మాపూర్ గ్రామానికి చెందిన నిర్మలమ్మ,బాలయ్య దంపతులు అప్పులు చేసి ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేయగా,నీరు లేక పంట మొత్తం ఎండిపోయిందని నాయకుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.పంట చేతికందకపోవడంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని కన్నీటిపర్యంతమయ్యారు.పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాల్లో పశువులు మేత మేస్తున్న దయనీయ దృశ్యాలను చూసిన మాజీ మంత్రి చలించిపోయారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..పాలమూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు.రైతులు అప్పులు చేసి,ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తే చివరకు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కరెంటు కోతలు,నీటి ఎద్దడితో రైతులు తీవ్రంగా నష్టపోయారని,పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.రైతుల ఇళ్లలో తినడానికి గింజలు కూడా లేని దుస్థితి నెలకొందని,ఒకవైపు పంటలు ఎండిపోయి,మరోవైపు అప్పులు పెరిగి రైతులు బతుకు భారంగా గడుపుతున్నారని పేర్కొన్నారు.అప్పులు తీర్చలేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.రైతులు మరణిస్తే బీమా అందడం లేదని,రైతుబంధు కూడా లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు.ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నవాబుపేట,మిడ్జిల్ మండలాలను వెంటనే చేర్చాలని,మహబూబ్‌నగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.పంటలు నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి తగిన పరిహారం అందించాలని,రైతుల అప్పుల బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.కరువు సమయంలో రైతులను ఆదుకోకపోతే వారు తిరగబడే పరిస్థితి వస్తుంది.రైతుల సహనాన్ని ప్రభుత్వం చేతకానితనంగా భావించవద్దు.రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది.ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని డాక్టర్ లక్ష్మారెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని నరసింహులు,మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి,నాగిరెడ్డి,మాజీ ఎంపీపీలు అనంతయ్య,శ్రీనయ్య, నాయకులు ప్రతాప్,గండు చెన్నయ్య,గోపాల్ గౌడ్,తాహేర్,మెండే అంజయ్య,యాదయ్య,కృష్ణయ్య గౌడ్,సర్పంచులు రాఘవేందర్,కమలమ్మకుమార్,విశాలశివకుమార్,సునీతఆంజనేయులు,బాలకిష్టమ్మరాములు,గోపాల్ రెడ్డి,రాజు నాయక్,నరసింహ నాయక్,శ్యాంసుందర్ రెడ్డి,లింగంపల్లి తిరుపతయ్య,గండు తిరుపతయ్య,జంగయ్య,వెంకటేష్,ఆంజనేయులు తదితరుల అధిక సంఖ్యలో రైతులు,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.