BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం

Select Suryaa Now
జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం

టేకుమట్ల , మేజర్ న్యూస్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం వరకు బస్సు సర్వీసును కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దొంతుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం టేకుమట్ల మండల అధ్యక్షులు కుర్రే  మల్లయ్య యాదవ్, గిద్ద ముత్తారం సర్పంచ్ చంద్రకళ రవీందర్, రాఘవపూర్ సర్పంచ్ అంబాల కిరణ్ కుమార్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవతో జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీస్ ప్రారంభించడం జరిగిందని, బస్సు సర్వీసు ప్రారంభించడం వల్ల ఈ ప్రాంత ప్రజలు జమ్మికుంటకు ప్రయాణం చేయుటకు మార్గం సులభం  అయిందని, ఇందుకుగాను భూపాలపల్లి శాసనసభ్యులు  గండ్ర సత్యనారాయణ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గిద్ద ముత్తారం వయా టేకుమట్ల జమ్మికుంట బస్ సర్వీసు ప్రారంభించడం వల్ల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించిందని, అందుకుగాను  రాఘవపూర్ గిద్ద ముత్తారం కాల్వపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు  ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; రాజ కొమురయ్య, టేకుమట్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా