ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు
జఫర్ ఘడ్ , మేజర్ న్యూస్, మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ సీతారమచంద్రస్వామి ఆలయంలో పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేద పండితులు, పంతులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి మండల ఆర్యవైశ్య సంఘం మహిళలచే ఒడిబియ్యం సారెను ఘనంగా తీసుకురావడం జరిగింది. భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ ఈ ఊరేగింపు ఆకట్టుకుంది.అనంతరం శ్రీ బొందిలి (రాజ పుత్ర) సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో వైశ్య సంఘం ప్రముఖులు. మరియు బొందిలి రాజపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు
రిపోర్టర్; సురేష్ ,జాఫర్ గాడ్ ,జనగామ జిల్లా