భూమి వివాదంలో దాడి-కేసు నమోదు
నవాబుపేట సూర్య న్యూస్:భూమి వివాదం నేపథ్యంలో కంచె ధ్వంసం చేయడంతో పాటు భూమి కొనుగోలు చేసిన వారిపై దాడికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని చౌడూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..గోపాల్,వినోద్ అనే ఇద్దరు వ్యక్తులు చౌడూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్లు 357,364లో ఉన్న ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.ఈ నెల 30వ తేదీన భూమిని విక్రయించిన వారి సమక్షంలో సరిహద్దులు చూపించి కంచె ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన సిరిపురం రామస్వామి గౌడ్,సిరిపురం చంద్రశేఖర్,సిరిపురం సుధాకర్ గౌడ్ తదితరులు అక్కడికి వచ్చి కొనుగోలు చేసిన భూమిలోని కంచెను ధ్వంసం చేశారు.అంతేకాకుండా భూమి కొనుగోలు చేసిన వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడి దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.