BREAKING
సూపర్ మార్కెట్ ఫ్రీజర్లనే హ్యాక్ చేస్తే ఇతర టెక్నాలజీ ఎంతవరకు సురక్షితం?: నిపుణుల హెచ్చరికలు ఐర్లాండ్ పురాణాల ‘నరక ద్వారం’: చారిత్రక గుహ వైపు సరికొత్త నడక మార్గం ఆస్ట్రేలియా సోషల్ మీడియా నిషేధంపై హైకోర్టులో న్యాయ పోరాటం: రాజ్యాంగబద్ధతను సవాలు చేసిన రెడ్డిట్, డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ లిండ్సే క్లాన్సీ కేసులో రీట్రయల్ దిశగా ప్రాసిక్యూటర్ల అడుగులు: ముగ్గురు పిల్లల హత్య కేసులో తాజా పరిణామాలు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్న భారతీయ-అమెరికన్ ఓటర్లు: తాజా సర్వేలో కీలక విషయాలు వెల్లడి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వియత్నాం పర్యటన: రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు ఉక్రెయిన్ సహాయక కేంద్రంపై రష్యా భీకర బాంబు దాడి: 24 మంది మృతి, జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం ఉక్రెయిన్ ఎయిర్ అలర్ట్ యాప్ హ్యాక్: అణు దాడి అంటూ నకిలీ హెచ్చరికలు, భయాందోళనలు రేపినా తప్పిన గందరగోళం డిక్సన్ టెక్, దీపక్ నైట్రైట్ క్యూ2 ఫలితాలు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సవరించిన టార్గెట్ ప్రైస్, వృద్ధి అంచనాలు మోతీలాల్ ఓస్వాల్ క్యూ2 మధ్యంతర సమీక్ష: 12 త్రైమాసికాల్లోనే అత్యధిక లాభాల వృద్ధి, బీఎఫ్ఎస్ఐ మరియు లోహ రంగాల జోరు అజంతా ఫార్మా క్యూ2 రివ్యూ: అద్భుత పనితీరు కనబరిచినా ర్యాలీతో పరిమితమైన లాభాల పరిధి ముత్తూట్ ఫైనాన్స్ క్యూ2 రివ్యూ: లాభాలు పటిష్టంగా ఉన్నా నిర్మల్ బాంగ్ ఆచితూచి అడుగులు ఎఫ్‌పీఐల నిష్క్రమణ: పన్ను తగ్గింపు డిమాండ్ల పరిశీలనకు ఎఫ్‌ఎం సై స్టాక్ మార్కెట్ టుడే: నవంబర్ 3 ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం జోరు: గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్ల జంప్, భారీ గ్యాప్-అప్ సంకేతాలు

దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

Select Suryaa Now
 దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

అనపర్తి, మేజర్ న్యూస్: అర్నబ్ తుఫాన్ కారణంగా అనపర్తి నియోజకవర్గంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, దెబ్బతిన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గ పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో చేతికి అందాల్సిన పంట తుఫాన్ ధాటికి నేలకొరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట నష్టం తీవ్ర భారంగా మారిందన్నారు. నేలకొరిగిన వరి చేలను కోయడానికి హార్వెస్టర్ యంత్రాలకు సాధారణం కంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారని తెలిపారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించారని, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేదని గుర్తుచేశారు.

 ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ లేదా పంటల బీమా ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించే విధానం ఉండేదన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా విషయంలో రైతులకు తగిన భరోసా కల్పించలేకపోయిందని విమర్శించారు.మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ ఆ ప్రయోజనం రైతులకు దక్కడం లేదని, దళారుల జోక్యం కారణంగా రైతులు గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కౌలు రైతులు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారని, ఇప్పటికే అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో తుఫాన్ వల్ల పంటలు దెబ్బతినడంతో మరింత సంక్షోభంలోకి వెళ్లారని అన్నారు. పంట నష్టపోయిన కౌలు రైతులకు తిరిగి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం కేవలం సమీక్షలు నిర్వహించడం, జీవోలు విడుదల చేయడంతో సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు తగిన నష్టపరిహారం అందించి రైతులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని, రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి ఏర్పడుతుందని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.