రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం.
అనపర్తి, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండలం రామవరం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటా పర్యటిస్తూ ఓటర్లను కలిసి వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించడంతో పాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి కృషి చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు నందిక ప్రమీల, రామవరం ఎంపీటీసీ-2 ఆదాడి చిన్న సత్యనారాయణ, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ గుడిమెట్ల వెంకటరెడ్డి, ఎస్సీ విభాగం నాయకులు లంక పెద్ద సత్యనారాయణ, లంక శ్రీను, యార్లగడ్డ నగేష్, సేవాదళ్ విభాగం నాయకులు నల్లమిల్లి ఆదినారాయణరెడ్డి, యువజన విభాగం నాయకులు చింత ప్రభాకర్‌రెడ్డి, గుడిమెట్ల శివశంకర్‌రెడ్డి, లంక గొల్లరాజు, మందపల్లి ఆనంద్, పంచాయతీ పాలకమండలి మాజీ సభ్యులు తాడేలు వెంకన్నతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.