BREAKING
ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు

వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు.

Select Suryaa Now
వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు.

 అనపర్తి, మేజర్ న్యూస్ . తుఫాను ప్రభావంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతన్నను మళ్లీ కురుస్తున్న వర్షాలు మరింత కుదేలు చేస్తున్నాయి. ఒకవైపు తుఫాను ధాటికి నేలకొరిగిన వరి పంటను చూసి ఆవేదన చెందుతున్న రైతులకు, మరోవైపు తిరిగి వర్షాలు కురుస్తుండటంతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట వర్షపు నీటిలో తడిసి ముద్దవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించే ప్రక్రియలో భాగంగా రైతు భరోసా కేంద్రాల వద్ద నష్టపరిహారానికి సంబంధించిన దరఖాస్తు పత్రాలను స్వీకరిస్తోంది. అయితే ఒకవైపు నష్టపరిహారం కోసం రైతులు దరఖాస్తులు చేసుకుంటుండగా, మరోవైపు మళ్లీ కురుస్తున్న వర్షాలు మిగిలిన పంటను కూడా దెబ్బతీస్తున్నాయి. 

పొలాల్లో వరి పంట నేలకొరిగి ఉండటంతో వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో కోత కోయడానికి కూడా వీలులేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ములుగుతున్న నక్క మీద తాటికాయ పడిన చందంగా ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న అన్నదాతకు తాజా వర్షాలు మరో పిడుగులా మారాయి. పంటను కాపాడుకోవాలన్న ఆశతో ఉన్న రైతులకు ప్రకృతి అనుకూలించకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వర్షాలు ఇలాగే కొనసాగితే వరి ధాన్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఒకవైపు భారంగా మారగా, మరోవైపు పంట చేతికందకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. 

వరుస ప్రకృతి వైపరీత్యాలు తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన తమకు తాజా వర్షాలు మరింత భారంగా మారాయని చెబుతున్నారు.ఇప్పటికైనా వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. గత తుఫాను నష్టాలతో పాటు తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని కూడా సమగ్రంగా అంచనా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి అర్హులైన వారికి తక్షణమే నష్టపరిహారం అందించడంతో పాటు, ధాన్యం తడవకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.