బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
గాజులరామారం మేజర్ న్యూస్ :గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఆదివారం సాయంత్రం బాలయ్య నగర్‌లో రూ.47.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు అధికంగా నివసించే బాలయ్య నగర్ బస్తీ ఏర్పాటుకు వ్యవస్థాపకులు ఎల్లయ్య చేసిన కృషి, త్యాగం మరువలేనివని అన్నారు. గత పన్నెండేళ్లుగా బాలయ్య నగర్‌లో కోట్లాది రూపాయల నిధులతో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా బస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు బతుకమ్మ ఘాట్, ఛత్ పూజ ఘాట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి వెంటే ఉంటానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో బాలయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ. నాగేష్, ఉపాధ్యక్షుడు సి.ఎస్.ఐ, ప్రధాన కార్యదర్శి ఈ. పార్వతి శ్యాంసుందర్, గంగయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్‌రాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, నవాబ్ భాయ్, ఇబ్రహీం ఖాన్, ఇతర నాయకులు, కార్యకర్తలు, బస్తీవాసులు పాల్గొన్నారు.