BREAKING
ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు

మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

Select Suryaa Now
మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

సూర్య - మానకొండూర్ : గ్రామీణ ప్రాంత మహిళలు కేవలం గృహిణులుగానే పరిమితం కాకుండా, వివిధ రంగాలలో స్వయం ఉపాధి శిక్షణ పొంది ఆర్థికంగా స్వాలంబన సాధించాలని మద్దికుంట గ్రామ సర్పంచ్ బుర్ర శ్రీధర్ గౌడ్ పిలుపునిచ్చారు. మానకొండూరు మండలం మద్దికుంట గ్రామంలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు, యువతులకు ఏర్పాటు చేసిన 45 రోజుల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బుర్ర శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల అభ్యున్నతి, వారి ఆర్థిక భద్రత ఎంతో కీలకమన్నారు. మహిళలు స్వశక్తితో ఎదిగినప్పుడే కుటుంబాలు, గ్రామాలు బాగుపడతాయనే లక్ష్యంతోనే గ్రామంలో ఈ ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆరాధ్య ఫౌండేషన్ వారు సామాజిక బాధ్యతతో ఉచితంగా అందిస్తున్న ఈ 45 రోజుల సువర్ణ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి మహిళా, యువతీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కుట్టు పనిలో నైపుణ్యం సాధించడం ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా, ఇంట్లోనే ఉంటూ సొంతంగా ఉపాధి పొంది కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవవచ్చని చెప్పారు. గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఈ శిక్షణలో చురుగ్గా పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. మద్దికుంట గ్రామంలో మహిళల ఆర్థికాభివృద్ధి కోసం భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు తమ వంతు సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా ఇన్‌చార్జ్ హిమబిందు, సీసీ చంద్రమౌళి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత, సీఏ శ్రీనివాస్, శిక్షణ నిర్వాహకులు  తో పాటు స్థానిక ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.