ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు
సూర్య - మానకొండూర్ : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని మండల విద్యాధికారి రాపెల్లి శ్రీనివాస్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా, ఇతర పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తి, సమానత్వ భావనను పెంపొందించడంతో పాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రోత్సాహం అందించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, వారికి సమాజం నుండి సరైన ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో ఎన్నో అద్భుత విజయాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల ఆటపాటలు, ఉత్సాహం తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో చెంజర్ల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు కె. లక్ష్మణ్ రావు, గట్టుదుద్దెనపల్లి ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రుద్ర శంకరయ్య, కొండపల్కల పీడీ కె. శ్రీలత, స్పెషల్ ఎడ్యుకేటర్ లకన్ బాబు, ఐఈఆర్‌పీలు కె. ఉమారాణి, రామ్‌ప్రసాద్, ఫిజియోథెరపిస్ట్ అజయ్ కుమార్, ఎమ్మార్సీ సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సంఖ్యలో పాల్గొన్నారు.